ఎంపీటీసీకి ఘనంగా వీడ్కోలు..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని  ముస్తాల పెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో  వీరవెల్లి  ఎంపీటీసీ కంచి లలిత మల్లయ్య కు వీడుకోలు సమావేశం నిర్వహించారు. అనంతరం వారిని  గ్రామస్తులు  పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీటీసీ చేసిన సేవలను పలువురు  కొనియాడారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎంపిటిసి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ గంటపాక యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ వడ్డే మదార్, మాజీ వార్డ్ నెంబర్లు గాదం యాదగిరి, బిజనీ లక్ష్మయ్య, కానుగు పరమేష్, గ్రామస్తులు మల్లేష్, యాదయ్య, ఉప్పలయ్య, మహేందర్, బిక్షపతి, వెంకటేష్, రైతు సమన్వయ సమితి మండల మాజీ అధ్యక్షులు కంచి మల్లయ్య, పంచాయతీ కార్యదర్శి ఈరబోయిన చంద్రయ్య యాదవ్ పాల్గొన్నారు.