సర్పంచ్ ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా ఐదు సంవత్సరాలు తమ గ్రామంలో చేసిన సేవలకు గుర్తింపు గా శుక్రవారం మహాముత్తారం రైతు వేదికలో ఎంపీపీ రత్నం సుభద్ర అధ్యక్షతన వారికీ కార్యదర్శులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి
జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు లింగమల్ల శారద విశిష్ట అతిథిగా హాజరు అయిమాట్లాడారు. సర్పంచ్ ల పదవీ కాలం లో చేసిన పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న బిల్లుల మంత్రి దృష్టికి తీసుకెళ్లి చెల్లింపు అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. మండల పరిషత్ అధ్యక్షులు రత్నం సుభద్ర మాట్లాడుతూ నిన్నటి తొ పదవీ కాలం పూర్తి అయిన సర్పంచ్ లు పదవీ బాధ్యతలు లేవని బాద పడకుండా ప్రజలలో ఉండి సేవ చేసి మల్లీ ఎన్నికల బరిలో నిలిచి ఏదో ఒక పదవి పొందాలని అన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ సర్పంచ్ ల ఎన్నికైనప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడ పని చేయడంతో అందరూ ఆత్మీయంగా ఉండటం ప్రస్తుతం ఈ పదవీ కాలం పూర్తి కావడం బాధగా ఉందని కానీ వీరి పీరియడ్ లో చేపట్టిన స్మశాన వాటిక, సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం రైతు వేదిక మొదలగు పనులు చిర స్థాయిగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్ రావు ఈడీ యస్ సి కార్పోరేషన్ భూపాల్ పల్లి, తహసీల్దార్ డి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి యం శ్రీనివాస్ రావు, పిఆర్ ఏఈ యం రమేష్ బాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి సతీష్ కుమార్ , గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఈజియస్ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.