మృదుభాషి స్వర్ణకు ఘనంగా వీడ్కోలు

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
మండల కేంద్రంలోని  శాంతి విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హెడ్ మిస్ట్రెస్ గా గత 6 సంవత్సరాలుగా విధులు విజయవంతంగా నిర్వహించి, బదిలీలపై సారపాక మండలంలోని రెడ్డిపాలెం గ్రామం పాఠశాలకు వెళ్తున్న స్నేహశీలి, మృదుభాషి స్వర్ణ(నన్)కు స్థానిక ఆర్.సి.ఎం ఛర్చి ఫాదర్ కూరపాటి యాకూబ్, జ్యోతిర్మయి యానిమేటర్ పరమ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థుల నడుమ సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. తదనంతరం ఫాదర్ యాకోబు, యానిమేటర్ ప్రభాకర్ గత ఆరు సంవత్సరాల కాలంలో ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణ పాఠశాల అభ్యున్నతికి అహర్నిశలు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిస్టర్స్ మేరీ చాంధల్, థామరిస్, సంఘ నాయకులు కరకపల్లి నాగేష్, రాంబాబు, రామ్మూర్తి, కిరణ్, బన్నీ, సచిన్, నవీన్, సులోచన, లక్ష్మి, జయమ్మ, సుగుణ, రాజీ, మంగ, యేసుమని, తదితరులు పాల్గొన్నారు.