జక్రాన్ పల్లి మండలం చింతలూరు గ్రామంలో ఈమధ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పదోన్నతులు మరియు బదిలీలపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలూరు నుండి ఆయా పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను పాఠశాల సిబ్బంది ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు గ్రామ ప్రముఖులు ఘనంగా సన్మానించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చింతలూరు నుండి మొన్న జరిగిన సాధారణ బదిలీల్లో ఉపాధ్యాయుడు బాలకృష్ణ ప్రసాద్, మరియు పదోన్నతుల్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పదోన్నతి పొంది వేరే పాఠశాలలకు వెళ్లిన శ్రీమతి జయలక్ష్మి శ్రీమతి రమాదేవి గార్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. గత 13 సంవత్సరాల కాలంగా ఉపాధ్యాయులు పాఠశాలకు అందించిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. పీఏసీఎస్ చైర్మన్ నాగుల శ్రీనివాస్ ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. అలాగే తాజా మాజీ సర్పంచ్ శ్రీమతి పుప్పాల సుకన్య ప్రసాద్ ఉపాధ్యాయుల సేవలను వారు పాఠశాల ఉన్నతిలో వారి యొక్క పాత్రను ప్రత్యేకంగా కొనియాడారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానం చేశారు. అలాగే బదిలీ, పదోన్నతులపై వెళ్లిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ ప్రసాద్, ఉపాధ్యాయులు జయలక్ష్మి రమాదేవి లు విద్యార్థులందరికీ ఒక జత స్కూల్ యూనిఫామ్ కొరకు రూ.15000 రూపాయలు ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా వారి యొక్క ఔన్నత్యాన్ని విద్యార్థుల పట్ల వారికి ఉన్న ప్రేమ శ్రద్ధలను పాఠశాల ఉపాధ్యాయ బృందం కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ ఏవో శ్రీమతి లక్ష్మి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంట అశోక్ ఉపాధ్యాయులు నరసయ్య, రాజేందర్, గంగారం, బలిరాం, శ్రీనివాస్, ఉమాదేవి, సంజీవ్ కుమార్లు, పూర్వ విద్యార్థులు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.