బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులకు వీడ్కోలు

Farewell to teachers who have gone on transferనవతెలంగాణ – ఏర్గట్ల
తడపాకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించి బదిలీపై వేరే పాఠశాలకు వెళ్ళిన ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ,నాగప్ప,గంగాధర్,నరేంధర్, సుజాత లకు పాఠశాల తరపున వీడ్కోలు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ జావీద్ మాట్లాడుతూ…. పాఠశాలలో  గత10 సంవత్సరాల పాటు  విధులు నిర్వర్తించి,విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దినందుకు పాఠశాల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.అనంతరం బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయులను సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్,రాములు,చక్రపాణి, దేవానంద్ గౌడ్,భూపతి,కృష్ణప్రసాద్, గంగాధర్,ఆనంద్,స్వప్న,విజయ పాల్గొన్నారు.