బదిలీపై వెళ్తున్న ప్రిన్సిపాల్ కు వీడ్కోలు 

నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని జిల్లెల్లగడ్డలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్  కళాశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపాల్  మంగళపల్లి శ్రీనివాస్ బదిలీపై  బెల్లంపల్లికి  వెళ్తున్న సందర్భంగా శనివారం శాలువాతో సత్కరించి   ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ  గత రెండు సంవ ఈత్సరాల నుంచి కళాశాలలో విధులు నిర్వహిస్తున్నానని, ఇక్కడి నుంచి వెళ్లిపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని తెలిపారు. ఈ రెండు సంవత్సరాలలో ఎవరినైనా బాధపెట్టి ఉంటే  పెద్ద మనసుతో క్షమించాలని  కోరారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.