పదవి విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళ్ళు కార్యాక్రమం

నవతెలంగాణ కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ శాఖలో జనవరి 31న పదవి విరమణ చేయడం జరిగిన నేపద్యంలోని వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం నుండి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జనవరి 31 నెలలో పదవి విరమణ చేసినవారు. ఎన్ .సత్యప్రసాద్, ఇన్ స్పెక్టర్ ,ఎన్.ఐ.బి, నిజామాబాద్, గారు పోలీస్ శాఖలు 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి పదవి విరమణ పొందినారు. వీరు పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా 1985 వ సంవత్సరంలో భర్తీ అయినారు. హెడ్ కానిస్టేబుల్ గా 1992, ఏ.ఎస్.ఐ గా 2001 సంవత్సరంలో ప్రమోషన్ పొంది, ఎస్.ఐ గా 2011 సంవత్సరంలో ప్రమోషన్ పొందడం జరిగింది. ఇన్ స్పెక్టర్ గా 2023 వ సంవత్సరంలో ప్రమోషన్ పొందడం జరిగింది. వీరికి సేవా పతకం ఒకటి ప్రశంస పత్రములు ,జి.ఎస్.లు, క్యాష్ రివార్డులు దాదాపు 80 వరకు గలవు. వీరి పదవి విరమణ వీడ్కోలు కార్యాక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వ హించడం జరిగింది. వీరికి శాలువలతో సత్కరించి వదవి విరమణ శుభాకాంక్షలు సర్టిఫికేటు (జ్ఞాపికలతో)  ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) జి.బస్వారెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఎంతో పనివత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని, ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని ,మీరు డిపార్టుమెంటలు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మరియు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు. ఈ వీడ్కోళ్లు సందర్భంగా పోలీస్ కార్యాలయం ఆఫీస్ సూపరింటెండెంట్ శంకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్  శ్రీశైలం, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ తిరుపతి , మరియు షకీల్ పాష వారికుటుంబ సభ్యులు హాజరయ్యారు.