
గ్రామ పంచాయతీ పాలక వర్గానికి వీడ్కోల సమా వేశం నిర్వహించామని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సర్పంచ్ గా కొనసాగిన ప్రేమల చంద్ర రెడ్డి, వార్డు సభ్యులకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ నిర్వ హించి, సన్మానం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దోమల కొమురయ్య, ఎంపీడీవో శ్రీధర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం విజయ వంతం చేసేందుకు పంచాయతీ కార్యదర్శి కృత జ్ఞతలు తెలిపారు.