
భీమ్‌గల్ మండలంలోని గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ లు గ్రామాల అభివృద్ధి కొరకు చేసిన సేవలను గుర్తించి, సర్పంచ్ లకు ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం సన్మానం నిర్వహించడం జరిగింది. 2019 ఫిబ్రవరి 2 న సర్పంచ్ లు అధికారంలోకి రావడం జరిగింది. 01 ఫిబ్రవరి 2024 తో సర్పంచ్ లకు పదవి కాలం ముగియనుంది. కాగ మండల సర్వ సభ్య సమావేశం ఎంపీపీ ఆర్మూర్ మహేష్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశం లో సర్పంచ్ లను సన్మానించి, మెమోంటో అందజేశారు. సర్పంచ్ లు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అదృష్టం రావడం సంతోషంగా ఉందని అన్నారు.సన్మానం చేసిన మండల సర్వసభ్య సమావేశానికి సర్పంచ్ లు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ చౌట్పల్లి రవి, తహసీల్దార్ వెంకట రమణ, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంపీవో గంగా మోహన్, పీఆర్ డిప్యూటీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.