నవతెలంగాణ – వలిగొండ: గత ప్రభుత్వంలో ఎన్నికైన మండల సర్పంచిలకు నేటితో పదవి కాలం ముగియడంతో స్థానిక ఎంపీపీ నూతి రమేష్ రాజు అధ్వర్యంలో రైతు వేదికలో సర్పంచులుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమ బాల నర్సింహ, ఎంపిడిఓ గీతారెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచలు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.