బదిలీ ఫై వెళ్లిన ఉద్యోగులకు వీడ్కోలు..

Farewell to the transferred employees..నవతెలంగాణ – సూర్యాపేట
పురపాలక సంఘములో విధులు నిర్వహిస్తూ బదిలీ ఫై వెళ్లుతున్న ఉద్యోగులకు సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో  కార్యాలయ అధికారులు,సిబ్బంది వీడ్కోలు పలికిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమీషనర్ బి.శ్రీనివాస్ మాట్లాడారు. ఉద్యోగి అన్న ప్పుడు బదిలీలు,రిటైర్డ్ మెంట్ లూ సహజమని పేర్కొన్నారు. బదిలీ పై వెళుతున్న వారు సూర్యాపేట మున్సిపాల్టీ లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చారన్నారు. బదిలీ పై వెళ్లిన వారిలో…మున్సిపల్ రెవిన్యూ అధికారి జానేశ్వరి ,సీనియర్ అకౌంటెంట్ గజ్జి శ్రవణ్ కుమార్ లు మిర్యాల గూడెం మున్సిపాల్టీకి బదిలీ అయ్యారు. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ గడుసు శివ రామ్ రెడ్డి భువనగిరి మున్సిపాల్టీకి, సీనియర్ అసిస్టెంట్ సక్కుబాయి,సంగు మాధవి ,జూనియర్ అసిస్టెంట్ యమ్.డీ.గౌసుద్దీన్,సారగండ్ల శ్రీనివాస్, కె.లలిత,బిల్ కలెక్టర్ శాంతమ్మ ,అటెండర్లు పిడమర్తి ప్రసాద్,వసంత లు కోదాడ మున్సిపాల్టీకి ,జూనియర్ అసిస్టెంట్ అజీముద్దీన్ తిరుమల గిరి మున్సిపాల్టీకి బదిలీ అయ్యారు.ఈ కార్యక్రమంలో డీ.ఈ.సత్యారావు,ఏ.ఈ సుమంత్,ఎస్.ఎస్ .ఆర్ .ప్రసాద్,ప్రభుకుమార్ ,ఇండ్ల మనోజ్, బూర సతీష్ తదితరులు పాల్గొన్నారు.