భువనగిరి మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ ఇటీవల బదిలీపై వెళ్లిన విజయ్ వీరారెడ్డికి వీడుకోలు సమావేశం భువనగిరి పట్టణంలోని ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్టణ ఇన్స్పెక్టర్ అర్జునయ్య హాజరై, మాట్లాడుతూ ఉద్యోగం చేస్తున్న ప్రతి అధికారి బదిలీపై వెళ్లక తప్పదని, పనిచేసే సందర్భంలో ఇతర అధికారులతో కలిసి చేసిన అనుభవం జ్ఞాపకాలు ఉంటాయని, వారు చేసిన మంచి నలుగురు చెప్పుకుంటారని అన్నారు. అనంతరం ఆయనను పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్, ఏఎస్సై బత్తిని రాములు గౌడ్, నుస్రత్ అలీ, హెడ్ కానిస్టేబుల్ చంద్రమౌళి, వేదవతి, లక్ష్మయ్య, ఉమెన్ కానిస్టేబుల్స్ రజియా, రజిత, సునిత, కానిస్టేబుల్స్ హరికృష్ణ, తదితరులు పాల్గొన్నారు.