ఫాం ఆయిల్ సాగుపై అవగాహన సదస్సు విజయవంతం చేయండి: టీజీ ఆయిల్ ఫెడ్ 

Farm Oil Cultivation Awareness Seminar Succeed: TG Oil Fedనవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ఆయిల్ఫెడ్ ఆద్వర్యంలో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నిర్వహిస్తున్న ఫాం ఆయిల్ పరిశ్రమలో రూ.30 కోట్లు వ్యయంతో నూతనంగా నిర్మించిన 2.5 మెగా వాట్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఈ నెల 12 వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న పామాయిల్ సాగు పై అవగాహన సదస్సుకు ఆయిల్ ఫాం సాగు దారులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీజీ ఆయిల్ ఫెడ్ రాష్ట్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనను ఆయిల్ఫెడ్ డీవో బాలక్రిష్ణ అశ్వారావుపేట లో బహిరంగ పరిచారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం స్థానిక ఎమ్మెల్యే  జారే ఆదినారాయణ అధ్యక్షతన,రాష్ట్ర వ్యవసాయ,కో – ఆపరేషన్స్,హేండ్లూం,టెక్స్టైల్స్  శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చే నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం పరిశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదిక పై పామ్ ఆయిల్ సాగు దారులకు( రైతులకు) పామ్ ఆయిల్ సాగు పై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫాం రీసెర్చ్ ( ఐఐఓపీఆర్) శాస్త్రవేత్తలు,ఉద్యాన శాస్త్రవేత్తలు చే అవగాహన సదస్సు నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు,శాసన సభ్యులు,టీజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా లు పాల్గొంటున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని  ఆయిల్ పామ్  కంపెనీలు,పామ్ ఆయిల్ రైతులు తో పాటు ఆంధ్రప్రదేశ్  పామాయిల్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆయిల్ పామ్ రైతులు పాల్గొంటున్నందున రైతు సోదరులు,పుర ప్రముఖులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమం ను జయప్రదం చేయాలని టీజీ ఆయిల్ఫెడ్ పిలుపునిచ్చింది.