గెలలు ధర కై కేంద్రం ఫార్ములా వద్దే వద్దు: ఫాం ఆయిల్ రైతు సంఘాం

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం టన్ను గెలలు కనీస మద్దతు ధర గా కేంద్రం వ్యవసాయ,ఉద్యాన శాఖ,ఎన్.ఎం.ఇ.ఒ – ఓ.పి రూ.13,346 లు కు ఆయిల్ఫెడ్,రాష్ట్ర వ్యవసాయ, ఉద్యాన శాఖలు ఒప్పందం( ఎం.ఒ.యు) కుదుర్చుకోవద్దని ఆయిల్ ఫాం సాగుదారుల సంఘాల రైతు నాయకులు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. ఈ విషయం అయి ఆయిల్ఫెడ్ డివిజనల్ కార్యాలయం లోని కేంద్రీయ నర్సరీలో పలువురు నాయకులు శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్ పామ్ గ్రోయర్స్ సొసైటి బాధ్యులు తుంబూరు మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ,ఉద్యాన శాఖ,ఆయిల్ఫెడ్ లు అనుసరిస్తున్న ఫార్ములా నే కొనసాగించడం శ్రేయోదాయకం అన్నారు.కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎం.ఎస్.పి కి అనుగుణంగా ఎం.ఒ.యు చేసుకోవద్దని,వచ్చే రెండు మూడు నెలల్లో తాత్కాలికం గా ధరలు తగ్గి కొంత నష్ట పోయిన దీర్ఘకాలికంగా కేంద్రం ఒప్పందం వల్ల తెలంగాణ రైతులు నష్ట పోతారు అనే అభిప్రాయం వెల్లడించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఆలపాటి రాం చంద్ర ప్రసాద్,కోటగిరి సీతారామ స్వామి,బండి పుల్లా రావు, కాసాని చంద్రమోహన్ ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ఫెడ్ డి.ఒ బాలక్రిష్ణ, ఫైనాన్స్ ఎక్జిక్యూటివ్ రాధాక్రిష్ణ,అశ్వారావుపేట,నారాయణపురం పరపతి సంఘాలు అద్యక్షులు సత్యనారాయణ,నిమ్మల పుల్లారావు, సీమకుర్తి వెంకటేశ్వరరావు,తలసిల ప్రసాద్,తాడేపల్లి రవి లు పాల్గొన్నారు.