
– ఐడిసిఎంఎస్ చైర్మన్ తారచంద్ నాయక్ ..
నవతెలంగాణ డిచ్ పల్లి
రైతు పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమని, ఎన్నికల సమయంలో ప్రజలకు, రైతులకు, మహిళలకు, యువకులకు ఇచ్చిన ప్రతి హామీ కి కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగానే సన్న రకం ఒక క్వింటాళ్ ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ను అందజేస్తున్నమని ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ నాయక్ పేర్కొన్నారు. సోమవారం డిచ్ పల్లి మండలం లోని రాంపూర్ సహకార సొసైటీ అద్వర్యంలో సన్న రాకం ధాన్యానికి రూ. 500 బోనస్ రైతుల ఖాతాలో జామ కావడం తో రైతులతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతని, రైతే రాజ న్నారు.అరుగలం కష్టపడి పండించిన పంటలను మద్య దళారులను నమ్మి మోసపోవద్దని, కోనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించాలని కోరారు.ఇప్నటికే దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని రైతు రుణమాఫీ చేసినట్లు, రూణమఫీ కానీ రైతులు అధైర్య పడకుండా ఉండాలని, త్వరలో వారందరి రూణమఫీ వస్తుందని వివరించారు. హామీలను ఇవ్వడమే కాకుండా దానిని నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే సాధ్యమన్నారు. అంతకు ముందు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి చిత్రపటాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ అద్వర్యంలో పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమం లో మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్, గారు పాలాభిషేకం చేసి రాంపూర్ గ్రామ రైతులతో కలిసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా ఓబీసీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్, సొసైటీ వైస్ చైర్మన్ స్వామి, సొసైటీ డైరెక్టర్ రాజ్ కుమార్ , సాయన్న, గంగారం, రాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కార్యదర్శి లచ్చమోల్ల దత్తాద్రి , కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గోపాల్, కాంగ్రెస్ పార్టీ యూత్ అద్యక్షులు నర్స గౌడ్, సందీప్, రాహుల్, నర్సారెడ్డి, చిన్నారెడ్డి, సీనియర్ నాయకులు సాయన్న, నాగేశ్వరరావు, నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.