
గుండాల మండల పరిధిలోని జగ్గాయిగూడెం గ్రామానికి చెందిన మొల్కం సమ్మయ్య (45) అనే రైతు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నేపథ్యంలో.. శనివారం అర్ధరాత్రి సమ్మయ్య ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య జయసుధ, వివాహిత, అవివాహిత ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.