నవతెలంగాణ-తొగుట
ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని గుడికందుల గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం మిరుదొడ్డి ఎస్ఐ బోయిని పర్శ రాములు, కుటుంబ సభ్యులు తెలిపిన కధనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోరిట గురువా రెడ్డి (52) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన వసాయ భూమిలో వర్షాకాలంలో మొక్క జొన్న పంట సాగుచేశాడు. నూర్పిడి పూర్తి అవడం తో అదే భూమిలో పొద్దు తిరుగుడు విత్తనం పెట్టారు. అందులో స్పైన్క్లర్ పైపులతో పంట భూమిని పార బెట్టేందుకు పైపులు సరి చేస్తున్న సమయం లో స్పైన్క్లర్ ఐరన్ పైపు వ్యవసాయ బోర్లకు వెళ్లే ఎల్టీ విద్యుత్ వైర్లకు తగిలి గురువారెడ్డి అక్కడి కక్కడే మృతి చెందాడు. శవాన్ని పంచనామా చేసి పొసుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు. మృతునికి భార్య రమ పిరియాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించా మని ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్యా, కూతురు, కొడుకు ఉన్నారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రైతు గోరింట గురువారెడ్డి మృతి చెందాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ భూమిలో విద్యు త్ వైర్లు మనిషికి అందే విధానంగా చాలా కిందికి వేలాడుతూ ఉన్నాయని, విద్యుత్ ఏఈకి మృతు డు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోలేదని ఆరోపిం చారు. విద్యుత్ వైర్లకు విద్యుత్ పోళ్లు ఏర్పాటు చేయాలని పదే పదే చెప్పిన నిర్లక్ష్యంగా వ్యవహరిం చారని మండిపడ్డారు. గురువారెడ్డి విద్యుత్ షాక్ గురై పడిపోగానే అక్కడే ఉన్న తన భార్య వెళ్లి అతన్ని పట్టి లేపేం దుకు ప్రయత్నం చేయగా ఆమె సైతం విద్యుత్ షాక్ గురైందని ఆవేదన వ్యక్తం. గ్రామంలో మల్లి ఇలాంటి సంఘటనలు జరుగ కుండ విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోవా లని సూచించారు. అదే విదంగా చనిపోయిన గురువారెడ్డి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.