నవ తెలంగాణ మల్హర్ రావు.
అప్పుల బాధతో ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతు గాజుల శంకరయ్య చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు.కొయ్యుర్ పోలీసుల పూర్తి కథనం ప్రకారం మండలంలోని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గాజుల శంకరయ్య అప్పు చేసి మూడు ఎకరాల చెను కౌలుకు తీసుకొని పత్తి సాగు చేయగా పత్తి దిగుబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం ఈ నెల 15న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లుగా తెలిపారు.మృతుని కుమారుడు గాజుల కిరణ్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కొయ్యుర్ ఏఎస్ఐ కుమారస్వామి తెలిపారు