నిజామాబాదు మండలంలోని గుండారం గ్రామంలో కృష్ణాగౌడ్ రైతు తన 2 ఎకరాల భూమి లో ఆయిల్ ఫామ్ పంటను వేసాడు. నీరు తక్కువగా ఉన్న ఈ పంటను పండించవచ్చని తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రెైతులు మీ ఆయిల్ పామ్ పంట కి సరైన సమయంలో నీటిని ఎరువులను అందించండి. మన జిల్లాలో ఇప్పటికే ఆయిల్ పామ్ సాగు చేస్తున్న పంట ఇప్పుడు 3వ ఏడాది అంటే 26 నెలల వయసు ఉన్న తోటలు ఉన్నాయి. 30-36 నెలల వరకు వచ్చే పుతని ఎప్పటికప్పుడు తొలగించి మొక్కని ఎదిగేలా చేయండి.నిర్మల్ జిల్లాలో ఇప్పుడు వచ్చే దసరా కి ఆయిల్ పామ్ మిల్ మొదలవడం జరుగుతుంది. కంపనీ వారు మీకు 15-20 కిలోమీటర్ దూరంలో ఆయిల్ పామ్ గెలల సేకరణ కాంటాలు పెట్టి మీ దగ్గరా నుండి ప్రభుత్వం నిర్ణయించిన ధరకి దళారుల వ్యవస్థ లేకుండా కొనుగోలు చేసి మీ అకౌంట్ లో వారం రోజుల లో డబ్బులు జయచేయడం జరుగుతుంది.కాబట్టి రెైతులు ఎలాంటి సందేహాలు లేకుండా ఆయిల్ పామ్ పంటని సాగుచేయాలి.ఇంకా మీ మీ దగ్గరా ఉన్న తోటలు లో కూడా ఆయిల్ పామ్ సాగు ను పెంచేలా చేయండి. ఇంకా ఏమైనా సమస్యల సందేహాలకు మీ మండల ఆయిల్ అధికారులను లేదా ఉద్యాన అధికారులు ని లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించండి అని తెలియజేశారు.