రైతు, కార్మిక చట్టాలను అమలు చేయాలి

– భారత్ బంద్ కు మద్దతుగా కార్మికుల దీక్ష
– పలు పార్టీల నాయకుల రాస్తా రోక
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు చట్టాలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేష్ డిమాండ్ చేశారు. భారత్ బంద్ కు మద్దతుగా శుక్రవారం కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్ష కార్యక్రమం చేపట్టారు. పలు పార్టీల నాయకులు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో  కేంద్ర ప్రభుత్వం కార్మికుల రైతులపై వ్యవహరిస్తున్న తీరు పై అగ్రహ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.