విద్యుత్ షాక్ కు గురై రైతు కూలీ మృతి…

నవతెలంగాణ-బజార్ హత్నూర్:  మండలంలోని మాడగూడ గ్రామానికి చెందిన కొడప గంగారాం (48) విద్యుత్ షా ురై మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మడగూడ గ్రామ సమీపంలోని పత్తి చేనులోకి కూలీగా వెళుతున్న రైతు పత్తి పంటలోకి వెళ్తుండగా పత్తి పంటకు  అడవిపందుల నుండి రక్షణగా అమర్చిన వైర్లకు విద్యుత్ అమర్చడంతో అటుగా వెళుతున్న కొడప గంగారంకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.  మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ు్నారు. ఇదిలా ఉండగా మండలంలో విద్యుత్ అధికారులు విద్యుత్ పై అవగాహన కల్పించకపోవడంతో మండలంలో అక్రమ విద్యుత్ ఘాతానికి ఎందరో రైతులు మృతి చెందినట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.