రైతు నాయకులు జగ్జీత్ సింగ్ దల్లేవాలా ప్రాణాలకు ముప్పు..

Farmer leaders Jagjeet Singh Dallewala's life is threatened.
– కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి..
– ఎఐకెఎంఎస్ జిల్లాఅధ్యక్షులు వేల్పుర్ భూమయ్య…
నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత వ్యవసాయ రంగాన్ని కాపాడాలని, రైతును రక్షించాలని అంటూ దేశంలో వ్యవసాయ రంగ రక్షణకు, రైతు గిట్టుబాటు ధరలకై ముఖ్యంగా ఎంఎస్ పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలని అఖిలభారత రైతు సంఘం ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పురు భూమయ్య అన్నారు. నూతన మార్కెట్ వ్యవసాయ విధానాలను విరమించుకోవాలని తెలిపారు. రైతు ఉద్యమానికి మోడీ ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీలను అమలు చేయాలని, పంజాబ్లో రైతు నాయకులు జగదీత్ సింగ్ దల్లే వాలా గత 46 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని వీరి ప్రాణాలు ఇప్పుడా అప్పుడా అన్నట్లు ఉన్న కేంద్ర ప్రభుత్వం స్పందించక, అయన ప్రాణాలకు ఎలాంటి ముప్పు ఏర్పడిన అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. సోమవారం డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో భూమయ్య మాట్లాడారు.కేంద్రం లోని ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెడుతుందని అన్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పుతుందని, పచ్చటి పంట పొలాలను దానిమీద ఆధారపడ్డ రైతులను వారి భూముల నుండి బేధాకలు చేసి ఆలాంటి భూములను అదాని, అంబానీలకు మోడీ ప్రభుత్వం అప్పచెప్పుతుందని వారన్నారు. వ్యవసాయ రంగంలో తెచ్చిన నల్ల చట్టాల రద్దుకై 13 నెలల పాటు జరిగిన  రైతు ఉద్యమంలో  750 మంది రైతుల ప్రాణాలు బలిగొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతు నాయకులు దల్లేవాలా  ప్రాణాలతో కూడా చలగటం ఆడుతుందని  భూమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు ఉద్యమ నాయకులతో చర్చలు జరపాలని, ఎంఎస్పి మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని, భారత రైతును రుణ విముక్తులను చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును, ఉపసంహరించుకోవాలని రైతాంగ సమస్యలన్నీ పరిష్కరించి దల్లే వాళ్లతో చర్చలు జరిపి వారి దీక్షను విరామింప చేయాలనీ వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  ఉపాధ్యక్షులు టి కృష్ణ గౌడ్, సహాయ కార్యదర్శి బి దేవస్వామి,డి పద్మ, బన్సీ తదితరులు పాల్గొన్నారు.