నవతెలంగాణ – తొగుట
మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీని వాస్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు రుణమాఫీ చేసిన శుభ సందర్బంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలా భిషేకం చేసి మిఠాయిలు పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు చేశారు. అదే విధంగా వన మహోత్సవంలో భాగంగా చెరువు కట్ట మీద మొక్కలు నాటారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీని యర్ నాయకులు పంది రాజు, బెజ్జనబోయిన రాములు, షాపి, శేఖర్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు బెజ్జనబోయిన ప్రవీణ్, భాను, ప్రశాంత్, సాజిద్, శేఖర్, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.