రైతు రుణమాఫీ సంబురాలు

Farmer loan waiver schemes

నవతెలంగాణ – మాక్లూర్

మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు రుణమాఫీ సంబురాలు రైతులు గురువారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు బైక్ లపై ర్యాలీగా రైతు వేదికకు చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. గత పది సంవత్సరాలుగా ఎదురు చూసిన రైతులకు  పంట రుణమాఫి ఒకే సారి రూ. లక్ష మాపి కావడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మార్క్ పెడ్ చైర్మన్ మర గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బుర్రోల్ల అశోక్, మండల వ్యవసాయాధికారి పద్మ, తహశీల్దార్ షబ్బీర్, సింగిల్  విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.