నవతెలంగాణ – బొమ్మలరామారం
ఎలాంటి షరతులు లేకుండా రైతుల రుణమాఫీ అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు ర్యకలశ్రీశైలం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో రైతు సంఘం మండల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమం నేటికీ 40 శాతం లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన షరుతులను ఎత్తేసి రుణమాఫీకి కావలసిన 31 వేల కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదలచేయాలని అన్నారు. రేషన్ కార్డులు, ఐటీ రిటర్న్స్, రీ షెడ్యూల్ లాంటి నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు సంవత్సరానికి 15వేల రూపాయలు రైతు భరోసా కింద వేస్తానని చెప్పినట్లుగా వెంటనే వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రబీ సీజన్లో వేయాల్సిన రైతు భరోసా డబ్బులను వేయలేదన్నారు. అదే విధంగా ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమై మధ్యలోకి వచ్చిందన్నారు.ఈ రెండు సీజన్ల డబ్బులను రైతుల ఖాతాల్లో త్వరితగతిన జమ చేయాలని అన్నారు.ఇట్టి సమావేశానికి రమేష్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కమిటీ సభ్యులు కిష్టయ్య, దేవేందర్, వెంకటేష్, దేశెట్టి సత్యనారాయణ ,మసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.