– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
రైతు రుణమాఫీ విషయంలో రైతులెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ రైతు సదస్సులో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నిమిషాన్ని రైతులందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. విడుదలవారీగా ఒకటి, రెండు, మూడో విడతలుగా రైతు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతులకు మొదటి విడతలో రానివారికి రెండో విడుతలో వచ్చిందని, రెండో విడుతల రానివారికి మూడో విడుతలో వచ్చిందన్నారు. మూడో విడతల కూడా, రుణమాఫీ రాని రైతులకు వచ్చే నెలలో గ్రీవెన్స్ సెల్ ద్వారా రుణమాఫీ డబ్బులు అందుతాయన్నారు. గల్ఫ్ వెళ్లి వారి భార్య పేరుల మీద ఖాతాలు ఉన్న రైతులకు, చనిపోయిన రైతు కుటుంబాలకు, బ్యాంకులో గాని వ్యవసాయ శాఖలో గాని సాంకేతిక కారణాల దృష్ట్యా ఆగిపోయిన రైతు కుటుంబాలకు, వచ్చే నెలలో తప్పకుండా రుణమాఫీ వస్తుందన్నారు. ఇంటింటికీ అధికారులు వచ్చి విచారణ చేసి, పూర్తిస్థాయిలో అందరికీ కూడా రుణమాఫీ వర్తింప చేయడం జరుగుతుందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో రైతులెవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి మాట ఇస్తే, తప్పకుండా చేసే వ్యక్తి కనుక రుణమాఫీ అందరికీ తప్పకుండా జరిగి తీరుతుంది అన్నారు. ప్రతిపక్షాల బూటకం మాటలు విని బూటకపు ధర్నాలకు గాని, బూటకపు మీటింగ్ లకు కానీ వెళ్లాల్సిన అవసరం రైతులకు లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులకు ఏం చేయనివాడు ఇప్పుడు వచ్చి రైతుల పక్షాన పోరాడుతామంటే నమ్మేంత పిచ్చివాళ్లు తెలంగాణ రైతులు కారని వారికి చెప్పాల్సిన బాధ్యత రైతులమైన మన అందరి పైన ఉందన్నారు.ఇది రైతు ప్రభుత్వం, రైతుల మేలు కోరే ప్రభుత్వం, కనుక ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి..ఆశీర్వదించండని సుంకేట రవి రైతన్నలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంతో చేయి చేయి కలపండి… ప్రభుత్వంతో నడవండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. రాబోయే రోజుల్లో రైతులను రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు.