రైతు పక్షపాతి సీఎం రేవంత్ రెడ్డి: చెరుకు శ్రీనివాస్ రెడ్డి

Farmer biased CM Revanth Reddy: Cheruku Srinivas Reddyనవతెలంగాణ – తొగుట
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రి రైతు పక్ష పాతి అని, తెలంగాణ రైతులకు రెండు లక్షల రుణ మాఫీ వచ్చే పంద్రాగస్టు లోపే పూర్తి చేస్తామని దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుదవారం ప్రజాభవన్ లో మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు, నియోజకవర్గ ఇంఛార్జి లు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్ లతో సీఎం సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పత్రిక ప్రకటన ద్వారా తెలి పిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి గా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.   దానిలో భాగంగానే రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ హామీ మేరకు నేటి నుండే లక్ష వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తున్నామని అన్నా రు. గురువారం నియోజకవర్గ కేంద్రంలో మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కాంగ్రెస్ శ్రేణులు, రైతులతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు.
రెండో రోజు మండ ల కేంద్రాల్లో, మూడో రోజు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీలు చేసి రైతులకు చేస్తున్న  రుణమాఫీ పై కాంగ్రెస్ నాయకులతో, కార్యకర్తల తో అవగాహన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వచ్చే పంద్రాగస్టు లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హర్షం వ్యక్తం చేశారు. రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రైతులం దరికీ రుణమాఫీ చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ. 2 లక్షల రుణమాఫీ దేశ చరిత్రలో గొప్ప పథకంగా నిలుస్తుందన్నారు. ప్రభు త్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు ఉచిత బస్ ప్రయా ణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, రైతు బంధు, ఉచి త విద్యుత్ వంటి పథకాల ద్వారా దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయలు ప్రజలకు అందించామని తెలిపారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడి నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయని కొంత మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు. రైతు ప్రభుత్వం అని చెప్పు కొంటూ రైతులను మోసం చేయడమే కాకుండా నేడు వారు కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయ డం సిగ్గు చేటన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే హక్కు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగు తుందని కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గా న్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే ద్యేయం గా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గురువారం నియోజక వర్గంలో జరిగే బైక్ ర్యాలీ కి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.