రైతు ధాన్యాన్ని కొనుగోలు చేయ్యాలి

Farmer should buy grain– పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి మున్సిపాలిటీ పట్టణంలో ఐకెపి పిఎసిఎస్ ద్వారా ఏర్పాటు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయ్యలని పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ అన్నారు.  రైతులు నెల రోజుల నుంచి వరి ధాన్యాన్ని ఐకెపి సెంటర్లో తీసుకువచ్చి ఇంతవరకు అధికారులు రాకపోవడం ప్రభుత్వం రైతులపై నిర్లక్ష్యంగా కొట్టొచ్చినట్లు అవుపడుతుంది దీపావళి పండుగ సందర్భంగా మూడు రోజుల నుంచి వర్షానికి వరి ధాన్యం తడిసి మొలకెత్తుచున్నవి హుస్నాబాద  బొమ్మయి పల్లి రైల్వే స్టేషన్ దగ్గర తడిసిన మొలికెత్తిన  ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం  కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటికై దళారుల దగ్గరికి వెళ్లి రూ.1900, 2000 కే రైతులు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సన్న దొడ్డు ధాన్యానికి రూ. 500 బోనస్ గిట్టుబాటు ధర ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు సన్నుడ్లుకు మాత్రమే రూ. 500 బోనస్ ఇస్తానని చెప్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  రైతులను మోసం చేసినట్లేనని అర్థమవుతున్నదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఈర్ల  ముత్యాలు  పట్టణ కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య కల్లూరు నాగమణి పట్టణ నాయకులు దండుగిరి బొమ్మాయిపల్లి శాఖ కార్యదర్శి బండి రవి, బండి వెంకటేశం, వల్లపు సత్తయ్య, లక్ష్మమ్మ బండి నరసింహ, గుజ్జు సుక్కయ్య, బుడిగే పద్మ, గుజ్జు కనకమహాలక్ష్మి, బుడిగే మల్లేష్, రైతులు  పాల్గొన్నారు.