రైతు శిక్షణ కార్యక్రమం

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
రైతు శిక్షణ కార్యక్రమాన్ని   ప్రొఫెసర్ జయశంకర్  విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో భువనగిరి మండలం  బొమ్మాయిపల్లి గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా  కో – ఆర్డినేటర్  డా. బి. అనిల్ కుమార్ మాట్లాడుతూ  ప్రస్తుత యాసంగి పంటల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు చీడపీడల నివారణకై  చేపట్టవలసిన చర్యలను రైతులకు వివరించారు.  ప్రస్తుతం జిల్లాల్లో ప్రధానంగా వరి పంట ఎక్కువగా ఉందని,  పత్తి పంటకు ప్రత్యామ్నాయం  నువ్వుల పంట పండించాలని తెలిపారు. పంటలను మారుస్తూ అధిక దిగుబడి సాధించవచ్చు అని రైతులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా కె అనిల్ వ్యవసాయ విస్తరణ అధికారి మాట్లాడుతూ  ప్రస్తుత వరి పంటలొ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలను రైతులకు వివరించారు.  అనువైన నేలల, యాజమాన్య పద్ధతుల  గురించి సూచనలు ఇచ్చారు. అనంతరం రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో  స్వేదా శాస్త్ర విభాగం శాస్త్రవేత్త  కే మమత,  కౌన్సిలర్ వేణుగోపాల్,  మాజీ సర్పంచ్  వెంకట్ రెడ్డి, గ్రామ రైతులు, రావీప్ విద్యార్థులు పాల్గొన్నారు.