రైతు సంక్షేమంమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..

– జిల్లా ఇంచార్జీ కొండా సురేఖ.
నవతెలంగాణ-తొగుట
రైతు సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వంలో కృషి చేస్తుం దని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇంచార్జీ కొండా సురేఖ అన్నారు. శనివారం మండలంలోని ఎల్లారెడ్డి పేట  గ్రామ సమీపంలో మల్లన్నసాగర్ రిజర్వాయర్  నుండి దుబ్బాక కాలువలోకి ఎమ్మెల్యే కొత్త ప్రభా కర్ రెడ్డి తో కలిసి నీటిని విడుదల చేశారు. సంద ర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులో ప్రస్తుతం 18 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందన్నారు. ప్రస్తు తం దుబ్బాక కెనాల్ ద్వారా 500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నామన్నారు. ఈ కెనాల్ పరిధిలో ఒక లక్ష 25 వేల ఎకరాలు ఆయకట్టు ఉందన్నారు. కానీ ఇప్పుడు 25 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందిస్తున్నామన్నారు. ప్రాజె క్టు నీటి ద్వారా సిద్దిపేట సిరిసిల్ల దుబ్బాక గజ్వేల్ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 మండలా లలో రైతులకు సాగునీరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీ ద్, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.