కౌలు రైతులకు రైతు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి: బండ శ్రీశైలం

నవతెలంగాణ – మునుగోడు
కౌలు రైతులకు రైతు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. సోమవారం మండలంలోని కల్వలపల్లి,గూడపూర్, కొరటికల్ గ్రామాలలో కౌలు రైతుల సమస్యలపై సర్వే నిర్వహించారు . సర్వే ప్రతినిధి బృందానికి కౌలు రైతుల సమస్యలు వివరించారు. కౌలు రైతులకు పంట రుణాలు, రైతుబంధు, రుణమాఫీ, గుర్తింపు కార్డులు ప్రభుత్వమే అందజేయాలని సర్వే బృందానికి వివరించారు. కౌలుకు సంబంధించినది 8000 నుండి12000 వరకు కౌలు కథ చెల్లిస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో30 నుండి 60 మంది కౌలు రైతులు వ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. వీరికి ప్రభుత్వ నుండి పంట రుణాలు అందడం లేదని, ప్రైవేటు అప్పుల మీదనే ఆధారపడి వ్యవసాయని సాగు చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సాగర్ల మల్లేష్, శివర్ల వీరమల్లు, ఒంటె పాకఅయోధ్య,అనిల్ కుమార్,అమరేందర్ రెడ్డి,మదా ర్, సైదులు, శంకరయ్య, యాదయ్య, పగడాల కాంతయ్య, బి యాదయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.