– ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట.
బ్యాంకుల్లో రైతుల ఆయిల్ ఫెడ్ ఖాతాలు స్థంభించడానికి కారణం బ్యాంకులకు అనుసంధానం అయిన అంతర్జాల (ఇంటర్నెట్) లో తలెత్తిన సాంకేతిక వైఫల్యమే నని,ఆయిల్ ఫెడ్ జాప్యం కాదని సంస్థ జనరల్ మేనేజర్ టి.సుధాకర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎం.డి యాస్మిన్ బాషా ఆదేశాల మేరకు ఏపీజీవీబీ మేనేజర్ లతో రైతులకు చెందిన ఆయిల్ ఫెడ్ ఖాతాలు స్థంభన పై సంప్రదింపులు చూచి చేసామని అన్నారు.ఈ నెల 27 న సోమవారం టీజీ ఆయిల్ ఫెడ్ ఉన్నతాధికారుల సూచన మేరకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వార కుడా ప్రయత్నించాం అని,అయినా ప్రయోజనం లేదని తెలిపారు. దీంతో ఇది ఏపీజీవీబీ బ్యాంకు కు అనుసంధానం అయిన అంతర్జాల సమస్యే కాని ఆయిల్ ఫెడ్ జాప్యం కాదన్నారు.ఎస్బీఐ బ్యాంక్ ద్వారా 28 న మంగళవారం ఏపీజీవీబీ రైతుల చెక్కులు సైతం మార్చడానికి ప్రయత్నించాం అని అయినా ఫలితం రాలేదని అన్నారు.అయినా మరల యూనియన్ బ్యాంక్ కి చెక్కు లు పంపడం జరుగుతుంది అని కావున నేడో రేపో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని,ఈ జాప్యానికి రైతులు సహకరించాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేసారు.