రైతు దినోత్సవం వేడుకల్లో రైతుల ఆగ్రహం

నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకొని తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. మద్నూర్ మండలంలోని పెద్ద తడగూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమంలో పలువురు రైతులు అగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ ఇసుక తరలించడానికి వందల సంఖ్యలో లారీలు లభిస్తాయి రైతు పండించిన పంటకు లారీలు కరువవుతాయి. 11 ఎకరాల ఉన్న భూ రైతులకు రైతుబంధు రాలేదు రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలు ప్రవేశపెట్టింది. రైతుబంధు రైతు బీమా దానితోపాటు రైతు పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని రైతు బంధు రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో సహాయం పడుతున్నాయని తెలిపారు రైతుల ఆవేశాన్ని అర్థం చేసుకుంటామని రైతులకు ప్రత్యేకంగా ఆదుకోవడానికి ప్రభుత్వం రాబోయే కాలంలో పకడ్బందీ చర్యలు తీసుకోబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగ ఆత్మ కమిటీ చైర్మన్ కొండ గంగాధర్ ఆ గ్రామ సర్పంచ్ మొగలాజి ఎంపీటీసీ ముక్తాబాయి రైతు కన్వీనర్ జక్కు గంగాధర్ ఏఈఓ సతీష్ గ్రామ కార్యదర్శి చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ భీమ్రావు ఆయా గ్రామాల వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.