పశు వైద్య అధికారుల సేవలు అభినందనీయం: రైతులు

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణ కేంద్రంలో గల పశు వైద్యశాల వైద్యుల సేవలు బేష్ అని రైతులు మంగళవారం తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నటువంటి రైతులకు వీరి యొక్క సూచనలు,  సహకారంతో నేడు రైతులు లాభాలు పొందుతున్నామని, గతంలో కన్నా నేడు  పట్టణంలో డైరీ ఫార్మ్ లు ధైర్యంగా, విజయవంతంగా రైతులు నిర్వహించడంలో వైద్యుల పాత్ర కీలకమని రైతులు తెలిపారు. అంతేకాకుండా వాతావరణ మార్పులతో వచ్చే జబ్బులకు  వైద్యులు సమయానుకూలంగా వైద్యం చేస్తున్నారని ఒకవేళ వ్యాధికి గురి అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ముందుగానే రైతులకు తెలియజేస్తున్నారని వారి యొక్క సేవలను కొనియాడారు. అంతేకాకుండా కరోనా సమయంలో వీరు చేసిన సేవలు చిరాస్మనీయమని వారు గుర్తు చేశారు. నూతనంగా పాడి పరిశ్రమ పెట్టుకోవాలనుకున్న రైతులకు తగు సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అని పశు వైద్యాధికారి జియాయుద్దీన్, వెటర్నరీ అసిస్టెంట్ రోజా శ్రీ లు తెలిపారు.