నవతెలంగాణ – జన్నారం
వేసవిలో పప్పు దినుసుల పంటల సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి.గోపి, డాక్టర్ రుక్మిణి దేవి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో పలు గ్రామాల రైతులకు వేసవిలో అపరాల పంటల సాగుపై అవగాహన కల్పించారు. మార్కెట్లో పప్పు దినుసులకు మంచి డిమాండ్ ఉందని, దానికి అనుకూలంగా ఆ పంటలు సాగు చేయాలన్నారు. ఏవో సంగీత, ఏఈవోలు త్రిసంధ్య, దివ్య, రైతులు పాల్గొన్నారు.