సేంద్రియ వ్యవసాయ పద్ధతితో రైతులకు ఎంతో మేలు..

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు

నవతెలంగాణ- నెల్లికుదురు
సేంద్రీయ వ్యవసాయ పద్ధతితో రైతులకు ఎంతో మేలు అని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు కన్యక పరమేశ్వరి గోశాల సొసైటీ నిర్వాహకులు అండెం శ్రీధర్ అనూష అలీ మధు సంధ్య అన్నారు. మండల పరిధిలోని కన్యక పరమేశ్వరి గోశాల సొసైటీని ఆదివారం సర్పంచులు పరుపాటి రుక్మిణి వెంకటరెడ్డి బీరవెల్లి యాదగిరిరెడ్డి ఎంపీటీసీ వెన్నాకుల వాణి శ్రీనివాస్ పెరుమాండ్ల గుట్టయ్య గౌడ్ మహబూబాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎదల యాదవరెడ్డి పారిశ్రామికవేత్త, వేముల బాబ్జితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గోశాలకు లేగదుడల సహకారం చేసిన శ్రీ గోపాల గోవర్ధన గో సంరక్షణ ట్రస్ట్ వారు ఈ లేగదులను అందించాలని అన్నారు. గోశాలలో ఏర్పాటు చేసిన లేక దూడలతో వచ్చినటువంటి పేడతో సేంద్రియ వ్యవసాయ పద్ధతులు నిర్వహిస్తే అధికంగా దిగుబడి వచ్చి రైతుకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆర్థికంగా కూడా రైతు అభివృద్ధి చెందుతాడని తెలిపారు తక్కువ పెట్టుబడుతూ ఎక్కువ లాభం వస్తుందని తెలిపారు ముఖ్య అతిథులను శాలతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ పట్టణ అధ్యక్షుడు రత్నపురం యాకయ్య వారి పల్లి ఉప్పలయ్య ఆగారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.