
ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన నాయకులు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో గురువారం నాడు ఎంపీపీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ రైతులకు ఋణ మాఫీ ప్రకటన చేయడంతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ,ప్రజా ప్రతినిదులు,రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి ,టపాసులు కాల్చిహర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంపీపీ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ 2018 సంవత్సరంలో ఇచ్చిన మాట సీఎం కేసిఆర్ ఋణ మాఫీ ప్రకటన చేయడంతో కేసిఆర్ రైతు బాంధవుడుఅనికొనియాడారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసిఆర్ రైతులకు ఉచిత విద్యుత్,రైతు భీమా,రైతు బంధు , సాగు నీరు,ఋణ మాఫీప్రకటనతోరైతులుఆనందవ్యక్తంచేస్తున్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ హయాంలో వ్యవసాయం పండగలా మారిందని అన్నారు.గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నరని కొనియాడారు. అంతే కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టు ఘనత ఆయనకే దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ.ప్రతాప్ రెడ్డి,సొసైటీ ఛైర్మన్ హన్మంత్ రెడ్డి,సర్పంచ్ మండల ఫోరం అధ్యక్షుడు తిర్మల్ రెడ్డి,వివిధ గ్రామల సర్పంచ్,ఎంపీటీసీలు,రైతులు పాల్గొన్నారు.