పండించిన పంటలు అమ్ముకోలేని దుస్థితిలో రైతులు

– సీతారాం నాయక్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాం నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు ఆధ్వర్యంలో రైతు సమస్యలపై మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. రైతు పండించిన పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నాడని, పండించిన ప్రతి గింజను కొంటాను అని చెప్పిన ప్రభుత్వాలు కొనుగోలు చేయక, వాహనాలు సరైన సమయానికి రవాణా చేయక అకాల వర్షాల వల్ల వరదల్లో తడిసి నష్టపోతున్న రైతుకు ఊతం ఇవ్వకుండా దశాబ్ది ఉత్సవాల్లో, రైతు ఉత్సవాల్లో, సమావేశాల్లో ప్రజా ధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన సమయానికి కొనేనాథుడు లేక అన్నదాతలు లబో,దిబోమంటున్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు కనీసం నష్ట పరిహారం ఇవ్వకుండా పంట ఇన్సూరెన్స్ డబ్బులు కూడా దోచుకుతింటూ, రైతన్నను చావు దెబ్బ తీస్తున్నారని అన్నారు. పంట పెట్టుబడికి అప్పులు చేసి పంట పండిస్తే, చివరికి ఆ పంటను అమ్ముకునే సమయంలో సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం భద్రపరుచుకువడానికి సరైన వసతులు కల్పించక, తరుగు పేరుతో రైతుని దగా చేస్తున్న మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా, అకాల వర్షాలతో అతలాకుతలం అవుతున్న రైతుకు ఆపన్న హస్తం అందించకుండా, ధాన్యం రవాణా చేయడానికి వాహనాలు కాంట్రాక్టు ఒకరికె ఇస్తూ, ధాన్యం సరఫరా చేయకుండా, ఇసుక రవాణా చేస్తూ, వాహనాల చుట్టూ రైతులు కాళ్ళరిగేల తిరిగిన కూడా కనికరించకుండా, రైతున్నల దగ్గర అదనపు డబ్బులు తీసుకుంటూ దగా చేస్తున్న కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోకుండా, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వాలు దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటూ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతున్నారని అన్నారు. ప్రజల కష్టాలను, నష్టాలను, అంచనా వేసి ప్రభుత్వంతో నష్ట పరిహారం ఇప్పించాల్సిన అధికారులు అధికార పార్టీ ఉత్సవాలకు, సమావేశాలకు జనాల్ని తరలిస్తూ బానిసలుగా బ్రతకడం నిజంగా ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటని అన్నారు. రైతు లేనిదే రాజ్యంలేదు, అలాంటి అన్నదాత ఈరోజు పుట్టెడు కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సింది పోయి ఉత్సవాల్లో పాల్గొనడం అత్యంత అమానవీయ చర్య అని అన్నారు. అందరి కడుపు నింపే రైతన్న ఈరోజు పండించిన పంటను అమ్మలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పంట పెట్టుబడి కోసం అప్పులు తెచ్చిన రైతన్న ఆ అప్పులు తీర్చలేని స్థితిలో ఉంటే పరమర్శించాల్సిన ప్రభుత్వాలు సంబరాలు జరుపుకోవడం సిగ్గుచేటు అని అన్నారు. ఇది ప్రజా స్వామ్యమా లేక కీచక రాజ్యమా? అని ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రాల్లో నిలువ ఉన్న ధాన్యపు బస్తాలను వాహనాలను సమకూర్చి తరలించాలని, తరలించిన ధాన్యం యొక్క డబ్బులు రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని, వచ్చే ఖరీఫ్ సీజన్ దగ్గరగా ఉండడం వల్ల పంట పెట్టుబడి కోసం వెంటనే పంట రుణాలు రైతన్నకు అందజేయాలని, పంట రుణమాఫీ కూడా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్.సి. సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కుర్సం కన్నయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య సారయ్య, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, మండల ఉపాధ్యక్షులు తేళ్ల హరిప్రసాద్, వేల్పుగొండ పూర్ణ, పాలడుగు వెంకటకృష్ణ, , సూదిరెడ్డి జనార్దన్ రీ3అనుబంధ సంఘాల అధ్యక్షులు చింతక్రాంతి, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షలు పడిదల సాంబయ్య, కాడబోయిన రవి, సూడి సత్తిరెడ్డి, ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మి- అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి- నరేందర్ రెడ్డి, గోపిదాసు ఏడుకొండలు, పాశం మాధవరెడ్డి, పాలెం యాదగిరి, సోమసాని నారాయణ స్వామి, వేల్పుగొండ ప్రకాష్, జెట్టి సోమన్న, అజ్మీర సమ్మాలు, బొల్లు కుమార్, తండా కృష్ణ, సింగపురం కృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు.