కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు.. ఇబ్బందుల్లో రైతులు

– కరెంటు సక్రమంగా రాకపోవడంతో వేసిన పంటలన్నీ బీటలు పారాయి

నవతెలంగాణ – మిరుదొడ్డి
కరెంటు సక్రమంగా రాక బానుడు భగభగ మండడంతో  వేసిన వరి పంటలు పూర్తిగా బీటలు పారాయి. ఆరుకాలం కష్టించి పండించిన పంట చేతి కంది సమయంలో కరెంటు లేక వేసిన బోరు సక్రమంగా పోయాక వేసిన పంట పూర్తిగా నేల పాలవుతున్నాయి. వరి నాట్లు వేసి కలుపు తీసి మందులు చల్లి అన్ని అయిపోయిన తర్వాత పంట నోటికందే సమయంలో ఒకవైపు ఎండ మరోవైపు కరెంటు పంటలపై భానుడి భగభగ మండడంతో పంటలన్నీ ఎండు ముఖం పట్టాయి. ప్రభుత్వ అధికారులు నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకునే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుతున్నారు.