మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో నష్టపోతున్న రైతులు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండలంలోని వివిధ గ్రామాలలో దాదాపు 500 ఎకరాలలో మొక్కజొన్నను రైతులు పండించారు. పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు మండలంలో కొనుగోలు కేంద్రం లేక లబోదిబోమంటున్నా.కష్టపడి పండించిన పంట అమ్ముకునేందుకు ప్రతి ఏటా ఇబ్బందులు తప్పడంలేదు.సకాలంలో పంట దిగుబడులు వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం కావడంతో రైతుల పాలిట శాపంగా మారింది.చేసేదేమీ లేక దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందని రైతులు వాపోతున్నారు.ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,070 మద్దతు ధర ప్రకటించినప్పటికీ.కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారు.కొందరు ప్రైవేట్‌ వ్యాపారులు కల్లాల వద్దకే వచ్చి మక్కను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాదాపు రూ.200 తక్కువగా ఇచ్చి రూ.1,950కే కొంటున్నారు.అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే ధర పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా కాంగ్రెస్‌ సర్కారు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు.ఈ విషయమై అధికారులను సంప్రదించగాప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కొనుగోళ్లు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.