రైతులు కాంగ్రెస్ కు ఘోరి కట్టడం ఖాయం..

నవతెలంగాణ- డిచ్ పల్లి:
కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎలక్షన్ కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదు పై బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను డిచ్ పల్లి, ఇందల్ వాయి మండల కేంద్రాలలో గురువారం దగ్దం చేశారు. ఈ సందర్భంగా ఇందల్ వాయి ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు చిలువేరి దాస్, సీనియర్ నాయకులు శక్కరి కొండ కృష్ణ లు మాట్లాడుతూ కాంగ్రెస్ రైతు వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తుందని, ఇంకోపక్క రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పిస్తు మొసలి కన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ను అరునురైన అమలు చేసి తిరుతమన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తుందని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమీ దిక్కు లేదన్నారు.రైతులు పేదలు, నిరుపేదలకు అందే సంక్షేమ పథకాలు యదావిధిగా కొనసాగే విదంగా చుడాలని పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి చేష్టలు చేస్తే ప్రజల అనుగ్రహానికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమం లో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు లోలం సత్యనారాయణ, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు సాయిలు, సర్పంచులు తెలు విజయ్ కుమార్, మోహన్ నాయక్, ఎంపిటిసి చింతల దాస్, బాబు రావు, ప్రధాన కార్యదర్శి పులి శ్రీనివాస్, నాయకులు కచ్చకాయల శ్రీనివాస్, అంబర్ సింగ్, సిహెచ్ దాస్, అరటి రఘు, రాజు నాయక్, క్రాంతి కుమార్, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ నయీమ్, షేక్ హుస్సేన్, సద్దాం, ప్రవీణ్ గౌడ్, డాక్టర్ శాదుల్లా, ఒడ్డెం నర్సయ్య, వెంకటేష్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.