పెసర పంటకు తెగుళ్లు.. పంట నష్టంతో రైతన్నల్లో ఆందోళన

Pests of the paddy crop. Farmers are worried about crop lossనవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలో సాగుచేసిన పెసర పంటకు తెగుళ్లు వచ్చాయి పంటకు వచ్చిన తెగులతో పెసర పంట నష్టం తో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం పంట సాగులో భాగంగా మద్నూర్ మండలంలో రైతులు పెద్ద మొత్తంలో పెసర పంట సాగు చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెసర పంట ఖాతా పూత దశకు వచ్చిన దానికి తెగుళ్లు సోకడంతో పంట ఆకులు మాడిపోతున్నాయి. పూత ఖాతా పూర్తిగా దెబ్బతింటున్న పంటను రైతులు తీసుకువచ్చి పురుగుల మందుల షాపుల యజమానులకు చూపించారు. ఇలాంటి పెసర పంట నష్టానికి ఎలాంటి మందులు వాడాలి అంటూ అడుగుతున్నారు పంటకు తెగుళ్లు రావడం ఆకులంతా మాడిపోయి పంట పూర్తిగా దెబ్బతిన్నట్లు పెసర పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. పంటలకు పురుగు మందులు వాడాలన్న వర్షం గరుభూ ఇవ్వడం లేక పంట తెగుళ్ళకు పిచికారి మందు ఆలస్యం కావడం పెసర పంట పూర్తిగా దెబ్బతిన్నందున ఆ పంట రైతులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇలాంటి పంట నష్టం పట్ల ఫార్టిలైజర్ షాపుల యజమానులు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని రైతులకు తెలిపారు.