నవతెలంగాణ – కంటేశ్వర్
కార్మిక సంఘాలు తలపెట్టిన ఫిబ్రవరి 16 కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు సంఘీభావం ప్రకటిస్తూ వారి ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష – కార్యదర్శులు గంగాధరప్ప- వెంకటేశ్, నాయకులు దేవేందర్ సింగ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ., కార్మిక, శ్రామిక వర్గాలను అణిచివేస్తూ.. రైతాంగాన్ని అపాహస్యం పాలు చేస్తూ.. ఉపాదిహామీ పథకాన్ని రద్దు చేసే కుట్ర చేస్తూ కార్పొరేట్ వ్యవస్థలకు మాత్రమే పెద్దపెట్టవేస్తున్నది. మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ బడ్జెట్ దాన్నే రుజువు చేస్తున్నది. అలాగే మతోన్మాద విధానాలను దేశ ప్రజలపైన రుద్దుతూ, యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయకుండా మూడ విశ్వాసంలో ముంచి తేలుస్తున్నారు. ఈ రెండిటిని వ్యతిరేకిస్తూ కార్మిక చట్టాలను కాపాడాలని, 80% గా ఉన్న పేదలను, పేదల జీవితాలను అభివృద్ధి చేయాలని, దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఫిబ్రవరి 16 తారీఖున గ్రామీణ బంధుకు పిలుపునిచ్చినాయి. వారికి మద్దతుగా రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, ఎస్ కే యం (కిసాన్ సంయుక్త మోర్చా) లు గ్రామీణ బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. స్వయంగా గ్రామాల బంధు కార్యక్రమంలో పాల్గొంటూ.. బంద్ నిర్వహించబోతున్నాము. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని రైతాంగానికి, శ్రామిక ప్రజలకు, ఉపాధి కూలీలకు పిలుపునిస్తున్నాం అని తెలియజేశారు.