రైతు భరోసా రైతుకు అందని ద్రాక్షే నా

Farmer's assurance is a gift that the farmer does not get– కడారి నాగరాజు సీపీఐ(ఎం) పార్టీ గ్రామ కార్యదర్శి.
నవతెలంగాణ – గోవిందరావుపేట
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన రైతు భరోసా రైతాంగానకి అందని ద్రాక్ష గానే మిగిలిపోనిందని సీపీఐ(ఎం) మండలం పసర గ్రామ కమిటీ కార్యదర్శి నాగరాజు అన్నారు. గురువారం మండలం పస్రా గ్రామంలోని సీపీఐ(ఎం) పార్టీ ఆఫీసులో నిర్వహించిన సమావేశంలో పార్టీ గ్రామ కార్యదర్శి కడారి నాగరాజు మాట్లాడుతూ వర్షాకాలం పంటలు స్టార్ట్ అయి రెండు నెలలైనా రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నా చిన్న కార్ రైతులు అప్పులు తెచ్చుకొని విత్తనాలను కొనుగోలు చేసి సేద్యం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా రైతుబంధు డబ్బులు మే నెల ఎండింగ్ లేదా జూన్ నెలలో పడి రైతులకు విత్తనాల టైం కు పడేటివి. కానీ రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం వర్షాకాలం పంటలు మొదలై రెండు నెలలైనా రైతు భరోసా డబ్బులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు భరోసా డబ్బులు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేనియెడల రైతు సంఘాలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు సోమ మల్లారెడ్డి. అంబాల మురళి. క్యాతం సూర్యనారాయణ. పల్లపు రాజు. జుట్టబోయిన రమేష్. రెడ్డి పురుషోత్తం రెడ్డి. బుర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.