
బాయేర్ మొక్కజోన్నతో రైతులకు మేలు చేకూరుతుందని కంపెనీ జిల్లా మెనేజర్ విక్రమ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రైతుల పంట పొలాల వద్ద క్షేత్ర ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజోన్నలో కొత్తరకం హైబ్రీడ్ డీకెసీ 9217 రకం చీడపీడలకు, గాలివానలకు, ప్రతికూల పరిస్థితులకు తట్టుకొని అధిక దిగుబడిని రైతులకు అందిస్తుందన్నారు. రైతులు బాయేర్ కంపెనీ మొక్కజోన్నను వాడి అధిక దిగుబడి పొంది ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ సంపత్, మండల ప్రతినిధి సంతోష్‌కుమార్, రైతులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.