అట్టహాసంగా రైతు దినోత్సవ వేడుకలు

– జ్యోతీ ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
– డప్పుల దర్వులతో ఎడ్ల బండ్లపై,ట్రాక్టర్లపై సమావేశానికి విచ్చేసిన రైతులు
– రైతులతో కలిసి ప్రజా ప్రతినిధులు,అధికారుల సహపంక్తి భోజనాలు
నవతెలంగాణ-ఆమనగల్‌
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన రైతు దినోత్సవ వేడుకలు ఆమనగల్‌, కడ్తాల్‌ మండలాల్లో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రైతు వేదిక భవనాల వద్ద నిర్వహించిన వేడుకల్లో పాల్గొనేందుకు రైతులు డప్పుల దర్వులతో ఎడ్ల బండ్లపై, ట్రాక్టర్లపై తరలి వచ్చారు. కడ్తాల్‌ మండల కేంద్రంలో కల్వకుర్తి శాసన సభ్యులు గుర్క జైపాల్‌ యాదవ్‌ జ్యోతీ ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఆమనగల్‌తో పాటు ఆకుతోటపల్లి, పోలేపల్లి, రాంనుంతల, కడ్తాల్‌ మండల కేంద్రముతో పాటు రావిచేడ్‌, మక్తమాధారం, ముద్విన్‌ తదితర గ్రామాల్లో ఉన్న రైతు వేదిక భవనాల వద్ద నిర్వహించిన వేడుకల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సహపంక్తి భోజనాలు నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఆదర్శ రైతులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నేనావత్‌ అనురాధ పత్య నాయక్‌, జర్పుల దశరథ్‌ నాయక్‌, ఎంపీపీలు నేనావత్‌ అనిత విజరు, కమ్లి మోత్యా నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ గంప వెంకటేష్‌ గుప్తా, ఏఎంసీ చైర్మెన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీలు జక్కు అనంత్‌ రెడ్డి, ఆనంద్‌, తహసీల్దార్‌ జ్యోతి, ఎంపీడీఓలు ఫారూఖ్‌ హుసేన్‌, రామకృష్ణ, మున్సిపల్‌ చైర్మెన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌ చైర్మెన్‌ భీమనపల్లి దుర్గయ్య, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ, జోగు వీరయ్య, సర్పంచులు గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి, తులసి రామ్‌ నాయక్‌, సులోచన సాయిలు, యాదయ్య, సోనా శ్రీను నాయక్‌, బాల్‌ రాం, శ్రీపాతి రజిత శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీటీసీలు సరిత పంతు నాయక్‌, నిట్ట మంగమ్మ నారాయణ, దోనాదుల కుమార్‌, లచ్ఛిరామ్‌ నాయక్‌, బొప్పిడి గోపాల్‌, మంజుల చంద్రమౌళి, ప్రియా రమేష్‌, ఉపసర్పంచులు రామకృష్ణ, శారదా పాండు నాయక్‌, వినోద్‌, ఏఎంసీ డైరెక్టర్లు సురమళ్ళ సుభాష్‌, రమేష్‌ నాయక్‌, లాయఖ్‌ అలి, నర్సింహ, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ సేవ్యా నాయక్‌, ఏఎంసీ కార్యదర్శి సరోజ, వ్యవసాయ అధికారులు అరుణ కుమారి, శ్రీలత, ఏఈఓలు, ఆయా గ్రామాల కార్యదర్శులు, వైద్య శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.