– ప్రతి పక్షాలు రాద్దాతం: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు/కాటారం
రైతులు అధైర్య పడొద్దు,అర్హత కలిగిన ప్రతి రైతుకు ఋణమాపి అవుతుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాను అన్నారు.సోమవారం కాటారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు అర్హత కలిగిన రైతులు అధైర్య పడొద్దన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హత ఉన్న రైతులందరికీ రుణ మాఫీ అవుతుందని తెలిపారు.కొంత మంది ప్రతి పక్ష నాయకులు సాంకేతిక పరంగా బ్యాంక్ లలో ఏర్పడిన సమస్యలను అనువుగా చేసుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.ఒక వైపు పకృతి వైపరీత్యంతో ఏర్పడిన అధిక వర్షాలతో వరదలు వచ్చి రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్ట జరిగిందని, స్వయానా ముఖ్య మంత్రి, మంత్రులు ఎంఎల్ఏ లు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు చేరువలో ఉంటూ ఉండి సహాయక చర్యలు చేపట్టి వారి ఆదుకునే కార్యక్రమం చేస్తున్నారు ఎప్పుడు లేని విధంగా వరద సహాయ చర్యలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రాణనాష్టం కానీ ఆస్తి నష్టం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రభుత్వ సూచనల మేరకు ఈరోజు ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరగకుండా ప్రయత్నం చేశామన్నారు.ప్రాణ నష్టం,ఆస్తి నష్టం జరిగిన కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.వారి ప్రభుత్వ హయం లో గత పది సంవత్సరాలలో వరదలు వచ్చిన పంటనష్టం జరిగిన ఇండ్లు కూలీ పోయిన ఒక్కసారి కూడా నష్ట పరిహారం అందించలేదన్నారు.తమ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా పంట నష్ట వచ్చిన జిల్లా యంత్రంగాతో పూర్తి స్థాయిలో సర్వే చేపించి పంట నష్ట పరిహారం చెల్లిస్తామని రాబోయే కాలంలో ప్రతి రైతుకి అండగా ఉంటామని తెలిపారు అదే విధంగా ఇలాంటి విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనక బదులు ఇలాంటి రాజకీయాలు చేయొద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.