రైతులు అధైర్యపడవద్దు.. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ

నవతెలంగాణ – రామారెడ్డి
అర్హులైన ప్రతి రైతుకు రూ 2 లక్షల వరకు రుణమాఫీ ప్రభుత్వం చేస్తుందని, సాంకేతిక కారణాల వల్ల కొందరి రైతుల పేర్లు వెల్లడించక పోయారని, శనివారం మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు అధైర్య పడవద్దని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తుందని, ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వం మండల, జిల్లా స్థాయిలో సందేహాలను నివృత్తి చేయడానికి కౌంటర్లను ఏర్పాటు చేశారని, అధికారులను సంప్రదించాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వం   రైతుల ప్రభుత్వం మని పేర్కొన్నారు.