
రైతులకు రైతుల మేలుకోరే ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకరి గురువయ్య, దొనకొండ వీరయ్య అన్నారు. శనివారం గుంజలూరు గ్రామంలో 100కె వి ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ఓవర్ లోడ్ తో పదేపదే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ అవుతుండడంతో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు వేణా రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో అధికారులతో మాట్లాడి ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించినందుకు, రైతులు, నాయకులకు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పుల్లయ్య, వెంకన్న, గురువయ్య, వెంకన్న, కనకయ్య, అనిల్, సంజీవ, దుర్గయ్య, అంజయ్య, రమేష్, కోటయ్య, లక్ష్మయ్య, బిక్షం, నాగయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.