
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా రైతాంగానికి ఇచ్చిన హామీల అమలు చేయకుండా కాలయాపన చేస్తూ పబ్బం గడుపుతోందని తక్షణమే రైతాంగానికిచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్ కార్యాలయంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతాంగానికిచ్చిన హామీలను అమలు చేయాలని మండలాధ్యక్షుడు కొలిపాక రాజు అధ్వర్యంలో బీజేపీ శ్రేణులు తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రమందజేశారు.బీజేపీ నాయకులు బుర్ర మల్లేశం,దొమ్మటి రాములు,మండల ప్రధాన కార్యదర్శి ముస్కె మహేందర్,మండల ఉపాధ్యక్షుడు కొత్తపేట రామచంద్రం,పట్టణాధ్యక్షుడు సంగ రవి,దళిత మోర్చా మండలాధ్యక్షుడు వేముల శంకర్,మండల నాయకులు గంప రవి కుమార్,శీలం వెంకటేశం,ఒగ్గు కనకయ్య,రాజిరెడ్డి, గండ్ల శ్రీను పాల్గొన్నారు.